Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పార్టీని విమర్శిస్తే... బంధుత్వాలను కూడా పక్కనపెట్టక తప్పదు!: సోదరుడికి కేఈ వార్నింగ్

రాజ్యసభ టికెట్ విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు బీసీలకు అన్యాయం చేశారని కర్నూలులో ఆ పార్టీ జిల్లా శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీనే కాకుండా పార్టీ అధినేత చంద్రబాబును విమర్శిస్తే బంధుత్వాలను కూడా పక్కన పెట్టక తప్పదని ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి నిన్న హెచ్చరికలు జారీ చేశారు. ఈ విషయంలో అన్న, తమ్ముడు, బంధువు, స్నేహితుడు... అన్న తేడా లేకుండా ప్రతి విమర్శ చేయాల్సి వస్తుందని, పార్టీపరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. నిన్న కర్నూలులోని తన సొంతింటిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఈ కృష్ణమూర్తి ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News